అనుచరుడిని చెంపకేసి కొట్టిన మాజీ సీఎం.. వీడియో

Wed,September 4, 2019 02:53 PM

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సిద్ధరామయ్య తన అనుచరుడిని చెంపకేసి కొట్టారు. ఈ సంఘటన మైసూర్‌ ఎయిర్‌పోర్టు వెలుపల బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతుండగా.. తన అనుచరుడు ఫోన్‌లో మాట్లాడుతూ మాజీ సీఎం చెవి వద్ద ఫోన్‌ పెట్టేందుకు ప్రయత్నించాడు. మీడియాతో మాట్లాడిన అనంతరం కూడా సిద్ధరామయ్యకు విసుగుపుట్టించేలా ఆ వ్యక్తి ప్రవర్తించాడు. తనకు ఏదో సిఫారసు ఇప్పించేలా ఓ అధికారికి చెప్పాలని సిద్ధరామయ్యను సదరు అనుచరుడు కోరినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనుచరుడి ప్రవర్తన నచ్చక సిద్ధరామయ్య అతనిపై చెంపకేసి గట్టిగా కొట్టారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
1401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles