అక్కాచెల్లెళ్ల ప్రాణాలు తీసిన ఆస్తి వివాదం

Fri,December 28, 2018 02:54 PM

ఉత్తరప్రదేశ్ : ఆస్తి వివాదం రెండు నిండు ప్రాణాలు తీసింది. ఈటావా జిల్లాలోని పంచవాలీ గ్రామంలోని తమ ఇంట్లో అక్కాచెల్లెళ్లు నిద్రిస్తుండగా కొందరు వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లక్ష్మి (18), సునీత (45) నిద్రలోనే ప్రాణాలు విడిచారు. తన పెద్ద సోదరి సునీత ఫిరోజాబాద్‌లో ఉంటుందని, ఇటీవలే ఓ ఫ్యామిలీ వేడుకకు వచ్చిందని ఆమె సోదరుడు పోలీసులకు తెలియజేశాడు. అక్కాచెల్లెళ్ల మృతిపై అతడు సివిక్ లైన్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇద్దరి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్‌ఎస్‌పీ అశోక్‌కుమార్ త్రిపాఠి తెలిపారు.

3284
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles