ఈ దీపావళికి 1,000 కోట్ల నష్టం

Sun,October 15, 2017 11:50 AM

మధురై : శివకాశి పటాకుల ఇండస్ట్రీకి ఈ ఏడాది భారీ నష్టం జరిగింది. ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో పటాకుల అమ్మకంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని విధించిన విషయం విదితమే. నవంబర్ 1వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శివకాశి పటాకుల ఇండస్ట్రీ నుంచి ఢిల్లీకి పటాకుల సరఫరా ఆగిపోయింది. పటాకులను సేల్ చేసేందుకు డీలర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఈ దీపావళికి శివకాశి పటాకుల ఇండస్ట్రీకి రూ. 1,000 కోట్ల నష్టం జరిగింది. ఇప్పటికే పటాకులను క్రెడిట్ ద్వారా కొనుగోలు చేసిన డీలర్లను డబ్బులు అడిగితే.. పటాకులను తిరిగి ఇస్తాం.. తప్ప డబ్బులు లేవని చెబుతున్నట్లు శివకాశి నిర్వాహకులు తెలుపుతున్నారు. అంతే కాదు సుమారు పది వేల మందికి ఉపాధి కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 60 నుంచి 70 శాతం మాత్రమే పటాకులను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

5017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles