గువాహటిలో బాంబు పేలుడు

Wed,May 15, 2019 09:32 PM

అసోం: గువాహటిలోని షాపింగ్‌ మాల్‌ వద్ద ఈ సాయంత్రం బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను గువాహటి వైద్యకళాశాలకు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాంబు పేలుడు సంభవించిన జూ రోడ్డు ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడింది తామేనని పరేశ్‌ బర్హా నేతృత్వంలోని ఉల్ఫా తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ దీపక్‌ కుమార్‌ తెలిపారు.

593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles