విమానాల్లో పొగ తాగడం నిషిద్ధం.. మ‌రి విమానాల్లో యాస్ట్రేలు ఎందుకు ఉంటాయి..!

Fri,June 14, 2019 05:42 PM

టైటిల్ చ‌ద‌వ‌గానే మీకు కూడా డౌట్ వ‌చ్చిందా? మీకే కాదు చాలామందికి ఈ డౌట్ వ‌చ్చి ఉంటుంది. ఎందుకంటే.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విమానాల్లో పొగ‌తాగ‌డం నిషిద్ధం. అంటే విమానాల్లో సిగిరెట్లు తాగ‌కూడ‌దు. అటువంట‌ప్పుడు మ‌రి విమానాల్లో యాస్ట్రేలు ఎందుకు ఉంటాయి? మీరు ఎప్పుడైనా విమానం ఎక్కిన‌ప్పుడు వాష్‌రూంలో యాస్ట్రేను గ‌మ‌నించారా? మీరు గ‌మ‌నించ‌కున్నా.. ప్ర‌తి విమానంలోని వాష్‌రూమ్స్‌లో యాస్ట్రేలు ఉంటాయి.


విమానాల్లో పొగ‌తాడ‌గ‌మే నిషిద్ధం అయిన‌ప్పుడు యాస్ట్రేల‌తో ప‌నేంటి.. అంటారా? అక్క‌డే మీరు ప‌ప్పులో కాలేశారు. పొగ‌తాడ‌గం నిషేధ‌మే కానీ.. ఎవ‌రు ఊరుకుంటారు చెప్పండి. వంద‌లో ఒక్క‌రు ఖ‌చ్చితంగా విమానంలో పొగతాగ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. ఒక‌వేళ పొగ‌తాగుతూ దొరికితే వాళ్ల‌కు ఫైన్ వేయ‌డం లేదా అరెస్ట్ కూడా చేస్తారు. కానీ.. వాష్ రూంలో ఒక‌వేళ యాస్ట్రే లేక‌పోతే.. వాళ్లు దొంగ‌చాటుగా సిగిరెట్ తాగి దాన్ని డ‌స్ట్‌బిన్‌లో వేస్తారు. అది మంట‌లు వ్యాపించ‌డానికి అవ‌కాశం అవుతుంది. దాని వ‌ల్ల విమానానికి పెద్ద ప్ర‌మాద‌మే సంభవిస్తుంది. అందుకే... యాస్ట్రేల‌ను పెడ‌తారు.

అంతే కాదు.. విమానాల్లో యాస్ట్రేల‌ను అమ‌ర్చాల‌ని చ‌ట్టం కూడా చెబుతోంది. చ‌ట్ట‌ప్ర‌కారం విమాన‌యాన సంస్థ‌లు త‌మ విమానాల్లో ఖ‌చ్చితంగా యాస్ట్రేల‌ను అమ‌ర్చాల్సిందే. ఒక‌వేళ అవి చెడిపోతే 72 గంట‌ల్లో వాటిని రిపేర్ చేయించాల‌ట‌.

గ‌త మార్చిలో ఇండిగో విమానంలో గోవా నుంచి డిల్లీ వెళ్తున్న ఓ ప్ర‌యాణికుడు రెస్ట్ రూంలో సిగిరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి ఘ‌ట‌నలు చాలా జ‌రుగుతుంటాయి.

3880
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles