ఇక లైసెన్స్, రిజిస్ట్రేషన్ కార్డ్ డిజిటల్ రూపంలో ఉన్నా ఓకే

Fri,August 10, 2018 12:34 PM

న్యూఢిల్లీ: డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించే దిశగా కేంద్ర రోడ్డు రవాణ, హైవేల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాహనం రిజిస్ట్రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్‌లాంటివి డిజిటల్ రూపంలో ఉన్నా అంగీకరించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ మొబైల్ యాప్‌లలో వీటిని స్టోర్ చేసుకోవచ్చు. డిజిలాకర్‌లో ఉన్న డిజిటల్ కాపీలను ఒరిజినల్ డాక్యుమెంట్లుగానే పరిగణించనున్నారు. దేశవ్యాప్తంగా ఈ కొత్త నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. డిజిలాకర్‌లో ఉన్న వాటిని చట్టబద్ధమైన పత్రాలుగా ఇప్పటికే మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటకలాంటి రాష్ర్టాలు అంగీకరిస్తున్నాయి.

ఇక నుంచి అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా డిజిలాకర్‌లోని వాటిని చట్టబద్ధమైనవిగానే పరిగణించాలని ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. డిజిలాకర్ లేదా ఎంపరివాహన్ యాప్‌ను మీ ఆధార్ నంబర్‌తో అనుసంధానిస్తే సరిపోతుంది. ఆ తర్వాత అందులో మీ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లాంటి వాటిని ఎంటర్ చేసి సేవ్ చేయాలి. ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు డాక్యుమెంట్లను అడిగినపుడు ఈ యాప్‌లోని క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే సరిపోతుంది. దీనిద్వారానే అటు పోలీసులు లేదా అధికారులకు ఓ వాహనం లేదా వ్యక్తికి జరిమానా విధించే అవకాశం కూడా ఉంటుంది.

3613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles