ప్రాంతీయ సహకారానికి తొలి అడుగు: అష్రాఫ్ ఘని

Fri,May 5, 2017 06:14 PM


న్యూఢిల్లీ: ప్రాంతీయ సహకారానికి దక్షిణాసియా తొలి అడుగువేసిందని అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని అన్నారు. జీశాట్-9 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన నేపథ్యంలో ప్రధాని దక్షిణాసియా దేశాల అధినేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని మాట్లాడుతూ ఈ సాంకేతికాభివృద్ధి ప్రజల సర్వతోముఖాభివృద్ధికి నాంది కావాలని ఆకాంక్షించారు. జీశాట్-9 ఉపగ్రహ్నాని విజయవంతం చేయడంలో భారత శాస్త్రవేత్తల కృషి అభినందనీయమన్నారు.


నేపాల్ ప్రధాని ప్రచండ
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ స్వయం సంవృద్ధి సాధిస్తుంది. భారత్ తన అభివృద్ధిని ఇరుగుపొరుగు దేశాలకు కూడా అందిస్తోంది.

శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన
సార్క్ సభ్య దేశాల కోసం ప్రయోగించిన ఈ ఉపగ్రహం సహకారంతో కొత్త అడుగు పడింది. సార్క్ దేశాల మధ్య సహకారం పెంచేందుకు ఈ ఉపగ్రహం సహకరిస్తుంది.

మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్
ప్రాంతీయ సహకారంలో ఉపగ్రహ ప్రయోగం కొత్త మైలురాయి. భారత్ సహకారానికి దక్షిణాసియా రుణపడి ఉంటుంది. దక్షిణాసియాలో కమ్యూనికేషన్ల వ్యవస్థలను పటిష్టానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. టెలికాం, టెలీ మెడిసిన్, ప్రకృతి విపత్తుల నిర్వహణకు ఉపగ్రహ వ్యవస్థ సహకరిస్తుంది.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles