క‌న్నీళ్లుపెట్టిన ఆజంఖాన్‌

Sat,April 20, 2019 01:40 PM

SP leader Azam Khan burst into tears at UP rally, says being treated like terrorist

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గ ఎస్పీ అభ్య‌ర్థి ఆజం ఖాన్ క‌న్నీళ్లు పెట్టారు. భావోద్వేగానికి గురైన ఆయ‌న‌.. త‌న మ‌ద్ద‌తుదారుల‌పై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌న్నారు. త‌న‌ను జాతివ్య‌తిరేకిగా, ఓ దేశ‌ద్రోహిగా చూస్తున్నార‌ని, ప్ర‌పంచంలోనే ఓ పెద్ద ఉగ్ర‌వాదిగా త‌న‌ను ట్రీట్ చేస్తున్నార‌ని ఆజం అన్నారు. శుక్ర‌వారం రాంపూర్‌లో జ‌రిగిన ఓ బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ వీలైతే ప్ర‌భుత్వం త‌న‌ను బ‌హిరంగంగానే కాల్చివేసేద‌న్నారు. బీజేపీ అభ్య‌ర్థి జ‌య‌ప్ర‌ద‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ఆజంఖాన్‌పై ఈసీ మూడు రోజుల ప్ర‌చార నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. రాంపూర్‌ను కంటోన్మెంట్‌గా మార్చేశార‌న్నారు.

1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles