చెన్నై బీచ్ లో అరుదైన నీలి రంగు అలలు..వీడియో

Tue,August 20, 2019 05:16 PM

Sparkling Blue tides attracts visitors in chennai beach


చెన్నై: బీచ్ తీరమంటే సాధారణంగా అలలు వస్తుంటాయి..పోతుంటాయి. చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు వెంబడి బీచ్ లో కూడా ఆదివారం రాత్రి అలలు వచ్చాయి. అయితే ఈ అలలు రోజూ వచ్చిపోయే వాటి కంటే కాస్త ప్రత్యేకం. చెన్నై బీచ్ లో ఆదివారం రాత్రి నీలిరంగు అలలు తీరంవైపు కొట్టుకువచ్చాయి. చీకట్లో చక్ చక్ మని మెరుస్తూ వచ్చిపోయిన నీలిరంగు అలలు సందర్శకులను కన్నార్పకుండా చేశాయి. అరుదుగా వచ్చే ఈ అలల ఫొటోలు, వీడియోను సందర్శకులు తమ సెల్ ఫోన్లలో బందించారు. డీఎంకే నేత టీఆర్ బీ రాజా ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.
4219
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles