ట్రంప్ రాక ప్ర‌త్యేక‌మైంది: ప‌్ర‌ధాని మోదీ

Mon,September 16, 2019 10:27 AM


హైద‌రాబాద్‌: ఈనెల 22న అమెరికాలోని హూస్ట‌న్‌లో జ‌ర‌గ‌నున్న హౌదీ మోదీ స‌భ‌కు డోనాల్డ్ ట్రంప్ వ‌స్తార‌ని శ్వేత‌సౌధం స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఆనందం వ్య‌క్తం చేశారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయ‌న ఈ విష‌యంపై స్పందించారు. హౌదీ మెదీ స‌భ‌కు ట్రంప్ రావ‌డం ప్ర‌త్యేక‌మైంద‌న్నారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య ఉన్న ప్ర‌త్యేక స్నేహ‌బంధాన్ని సూచిస్తుంద‌న్నారు. భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లు నిర్వ‌హించే ఆ కార్య‌క్ర‌మానికి ట్రంప్‌ను ఆహ్వానించేందుకు ఆస్తిక‌గా ఉన్న‌ట్లు మోదీ త‌న ట్వీట్‌లో తెలిపారు. ట్రంప్ రాక‌.. అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి భార‌తీయులు అందిస్తున్న భాగ‌స్వామ్యాన్ని గుర్తిస్తుంద‌ని అన్నారు.

2802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles