స్పైస్‌జెట్ వర్షాకాల ఆఫర్

Wed,July 3, 2019 07:58 AM

SpiceJet Monsoon Offer

న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్..వర్షాకాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 6 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.888గా నిర్ణయించింది. పరిమిత కాల ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది సెప్టెంబర్ 25 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పరిమిత సీట్లు కలిగిన ఈ ఆఫర్ కింద ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే లభించనున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. అంతర్జాతీయ రూట్లలో కూడా వర్తించనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టును రూ.3,499కి విక్రయిస్తున్నది.

1314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles