కేంద్ర మంత్రి బాటిల్ క్యాప్ చాలెంజ్.. వీడియో

Fri,July 12, 2019 07:50 PM

Sports Minister Kiren Rijiju Nails Bottle Cap Challenge

బాటిల్ క్యాప్ చాలెంజ్.. సోషల్ మీడియా గురించి.. వైరల్ హాష్‌టాగ్స్ గురించి తెలిసిన వాళ్లందరికీ ఈ చాలెంజ్ సుపరిచితమే. సోషల్‌మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ వైరల్ అవుతూనే ఉంటుంది కదా. తాజాగా బాటిల్ క్యాప్ చాలెంజ్ వైరల్ అవుతోంది. అయితే ఇది అంత ఈజీ చాలెంజ్ కాదు. అందరూ ఈ చాలెంజ్‌లో విన్ కాలేరు. దీనికి టెక్నిక్ కావాలి. బాటిల్‌కు ఉన్న క్యాప్‌ను వెనుక నుంచి పాదాలతో తన్ని తీయాలి. అదే బాటిల్ క్యాప్ చాలెంజ్. ఈ చాలెంజ్‌లో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.

తాజాగా కేంద్ర క్రీడా మంత్రి కిరెణ్ రిజిజు.. బాటిల్ క్యాప్ చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఆయన ఫిట్‌నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఆయన ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బాటిల్ క్యాప్ చాలెంజ్‌లో పాల్గొని.. ఆ చాలెంజ్‌లో విన్ అయిన వీడియోను మంత్రి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

నిజానికి ఈ బ్యాటిల్ క్యాప్ చాలెంజ్‌ను టైక్వాండో నిపుణుడు, ఫైటర్ ఫరాబి స్టార్ట్ చేశాడు. అలా అలా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. చివరకు ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొన్ని విన్ అయ్యారు.1731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles