మాజీ సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

Mon,April 15, 2019 02:54 PM

Stones hurled at Mehbooba motorcade in Anantnag district

శ్రీనగర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబుబా ముఫ్తీ కాన్వాయ్‌పై ఇవాళ రాళ్ల దాడి జరిగింది. జమ్మూకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని ఓ ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఫ్తీ.. అనంత్‌నాగ్ వెళ్లి అక్కడ్నుంచి బిజ్‌బెహ్రాకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం కాన్వాయ్‌పై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడిలో ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను నుంచి మెహబుబా ముఫ్తీతో పాటు మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం మెహబుబా ముఫ్తీ అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అనంత్‌నాగ్ నుంచి ఆమె లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

2043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles