నా పాదాలను తాకొద్దు: మాయావతి

Mon,February 19, 2018 03:04 PM

న్యూఢిల్లీ: గ్రీట్ చేయాలంటే పాదాలను తాకాల్సిన పని లేదు. బీఎస్పీ అధినేత మాయావతి ఇప్పుడు ఈ ఆదేశాలను జారీ చేశారు. అభిమానులైనా, పార్టీ కార్యకర్తలైనా .. ఎవరూ తన పాదాలకు వందనం చేయకూడదని ఆమె సూచించారు. దళిత సంస్కర్తలు అంబేద్కర్, కాన్సీరామ్ అందించిన సూత్రాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాంటే.. పాదాలకు నమస్కరించడం వంటి చర్యలకు పాల్పడరాదు అని మాయావతి తాజాగా తమ పార్టీ నేతలకు హితబోధ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్టానికి మాయావతి నాలుగుసార్లు సీఎంగా చేశారు. ఆమె పాదాలను తాకేందుకు ఇప్పటికీ అనేక మంది తెగ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. పబ్లిక్ ఫంక్షన్ ఎక్కడ జరిగినా.. ఆమె కాళ్లను మొక్కేందుకు జనం ఎగబడుతుంటారు. అయితే ఇలాంటి గౌరవ వందనాలను తిరస్కరించాలని మాయావతి తన తాజా ఆదేశాల ద్వారా సందేశం పంపారు. కాళ్లు మొక్కడం గురించి తాజాగా బెహన్‌జీ ఆదేశాలు ఇచ్చినట్లు బీఎస్పీ ఎంపీ మున్కడ్ అలీ తెలిపారు.

1634
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles