జర్నలిస్టుపై దాడి చేసి నోట్లో మూత్రం పోశారు

Wed,June 12, 2019 11:39 AM

Stripped thrashed urinated upon UP journalist faces police wrath for doing his job

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో జీఆర్పీ పోలీసులు రెచ్చిపోయారు. ఓ జర్నలిస్టుపై అకారణంగా దాడి చేసి.. బలవంతంగా మూత్రం తాగించారు. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని దిమన్‌పురా వద్ద మంగళవారం రాత్రి ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో న్యూస్ 24కు చెందిన అమిత్ శర్మ అనే జర్నలిస్టు ఆ ఘటన కవరేజీ కోసం వెళ్లాడు. అక్కడున్న జీఆర్పీ పోలీసులు.. శర్మ వద్ద ఉన్న కెమెరాను లాక్కొని అతన్ని తీవ్రంగా చితకబాదారు. అంతటితో ఆగకుండా స్థానికంగా ఉన్న జీఆర్పీ స్టేషన్‌కు తీసుకెళ్లి లాకప్‌లో వేశారు.

అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బట్టలూడదీశారు. ఆ తర్వాత జర్నలిస్టు నోట్లో మూత్రం పోశారు. ఇక స్టేషన్‌కు భారీ సంఖ్యలో జర్నలిస్టులు చేరుకొని నిరసన తెలుపడంతో.. బుధవారం ఉదయం జర్నలిస్టు శర్మను పోలీసులు విడుదల చేశారు. రైల్వేల్లో అనధికారిక వ్యాపారుల(హ్యాకర్స్)పై కథనాన్ని ప్రచురించినందుకే తనపై పోలీసులు దాడికి పాల్పడ్డారని జర్నలిస్టు శర్మ తోటి జర్నలిస్టులకు చెప్పాడు. మొత్తానికి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్టుపై దాడి చేసిన ఎస్‌హెచ్‌వో రాకేశ్ కుమార్, కానిస్టేబుల్ సునీల్ కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.


1883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles