అరటికాడ మీద సరస్సు దాటి స్కూల్ కు చిన్నారులు..వీడియో

Tue,August 6, 2019 02:50 PM


అసోం రాష్ట్రాన్ని గత కొంతకాలంగా వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. అసోంలో కుండబోత వర్షాలతో నదులు, చెరువులు, సరస్సులు ఉప్పొంగాయి. వరదలతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజాగా అసోంలో చిన్నారులు అతి కష్టం మీద సరస్సును దాటి స్కూల్‌కెళ్తున్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. దరాంగ్ జిల్లాలో విద్యార్థులు తమ స్కూల్‌కు వెళ్లేందుకు మధ్యలో ఉన్న నదిని దాటి వెళ్లాలి. నదిలోకి ఓ వ్యక్తి దిగి, అరటికాడపై విద్యార్థులను నిలబెట్టి వారిని ఒడ్డుకు చేర్చుతున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చదువు మీద ఉన్న శ్రద్దతో.. అతికష్టం మీద సరస్సు దాటి స్కూల్‌కు వెళ్తున్న చిన్నారుల డిడెకేషన్‌కు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. చిన్నారులు అరటికాడ మీద ఒడ్డుకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతోంది.



2836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles