అయోధ్య తీర్పుకు కీలకమైన పురావస్తు శాఖ నివేదిక

Sat,November 9, 2019 12:11 PM

న్యూఢిల్లీ : దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య కేసు వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. అయోధ్యలో వివాదాస్పదమైన రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ తుదితీర్పు వెల్లడించింది. భారత పురావస్తు శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టు తీర్పులో కీలకమైంది.సీజేఐ రంజన్‌ గోగోయ్‌ తీర్పు సారాంశాన్ని వెల్లడిస్తూ.. అయోధ్యలో ఖాళీ స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పురావస్తు విభాగం నివేదికలు చెబుతున్నాయి. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లామ్‌ మూలాలు లేవు. శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య అన్న హిందువుల విశ్వాసం వివాదరహితం. రామజన్మ భూమి న్యాయపరమైన వ్యక్తి కాకపోవచ్చు కానీ ఇక్కడ రాముడే కక్షిదారుడు. స్థలం తమ ఆధీనంలో ఉందని సున్నీ వక్ఫ్‌ బోర్డు నిరూపించలేకపోయింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువుల సందర్శించారనేందుకు ఆధారాలున్నాయి. అయితే రామ మందిరాన్ని కూల్చి మసీదును కట్టారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడేముందో చెప్పడానికి పురావస్తు ఆధారాలు కూడా లేవు అని రంజన్‌ గోగోయ్‌ చెప్పారు.

2149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles