రాత్రి 8 నుంచి 10 వ‌ర‌కే దీపావ‌ళి ప‌టాకులు పేలాలి..

Tue,October 23, 2018 11:08 AM

న్యూఢిల్లీ : బాణాసంచా విక్రయాలపై పూర్తి స్థాయి నిషేధం విధించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ పటాకుల విక్రయాలపై కొన్ని షరతులను మాత్రం పాటించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొన్నది. ఆన్‌లైన్‌లో బాణాసంచా అమ్మకాలను కోర్టు నిషేధించింది. ఈ కామర్స్ పోర్టల్స్ ఏవీకూడా ఆన్‌లైన్‌లో పటాకులను అమ్మరాదు అని కోర్టు తీర్పునిచ్చింది. దీపావ‌ళి రోజున రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ప‌టాకులు కాల్చాల‌ని, ఇక క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్‌ రోజుల్లో మాత్రం రాత్రి 11.45 నిమిషాల నుంచి అర్థ‌రాత్రి 12.45 వ‌ర‌కు ప‌టాకుల‌ను కాల్చుకోవ‌చ్చు అని కోర్టు తెలిపింది.


పటాకులను కాల్చడం ద్వారా వాయుకాలుష్యంతోపాటు ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందంటూ గతంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్‌భూషణ్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి ఆగస్టు 28న తీర్పును రిజర్వు చేసింది. రాజ్యాంగం అందించిన జీవించే హక్కు ఇరువురికి వర్తిస్తుందని, పటాకులపై నిషేధం విధించే విషయంలో ఈ రెండు అంశాలను సమంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

2805
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles