ఆర్బీఐకి సుప్రీం వార్నింగ్‌

Fri,April 26, 2019 11:50 AM

Supreme court orders RBI to disclose annual inspection reports of banks under RTI

హైద‌రాబాద్: బ్యాంకులకు చెందిన వార్షిక త‌నిఖీ నివేదిక‌ల‌ను వెల్ల‌డించాల‌ని ఇవాళ ఆర్బీఐకి సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. బ్యాంకుల‌కు భారీగా రుణాలు ఎగ‌వేసిన వారి జాబితాను కూడా బ‌య‌ట‌పెట్టాల‌ని కోర్టు చెప్పింది. ఆర్టీఐ కార్య‌క‌ర్త అగ‌ర్వాల్ వేసిన పిటిష‌న్‌ను స్వీక‌రించిన సుప్రీం ఈ వ్యాఖ్య‌లు చేసింది. వార్షిక త‌నిఖీ నివేదిక‌ను బ్యాంకులు విడుద‌ల చేయాల‌ని జ‌న‌వ‌రి నెల‌లో నోటీసులు కూడా సుప్రీంకోర్టు జారీ చేసింది. జ‌స్టిస్ ఎల్ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆర్టీఐ చ‌ట్టం ప్ర‌కారం వివ‌రాల‌ను తెలుపాల‌ని కోర్టు కోరింది. ఒక‌వేళ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తే.. త‌ర్వాత ధిక్క‌ర‌ణ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని సుప్రీం పేర్కొన్న‌ది.

1894
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles