మలయాళ నవల మీష సెన్సారింగ్‌కు సుప్రీం నో

Wed,September 5, 2018 04:21 PM

మలయాళ నవల మీష (మీసాలు)లో కొన్ని భాగాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎస్ హరీశ్ రాసిన ఆ నవలలో గుడికి వెళ్లే స్త్రీలను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలున్నాయని అంటూ ఢిల్లీకి చెందిన ఎన్ రాధాకృష్ణన్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత దృష్టితో పుస్తకాలపై సెన్సారింగ్ చేయడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రచయిత సృజనాత్మకతను గౌరవించాలని, చిత్రకారుడు రంగులతో ఆడుకున్నట్టుగానే, రచయిత మాటలతో ప్రయోగాలు చేస్తాడని తెలిపింది. పుస్తకాన్ని మొత్తంగా చూడాలి తప్ప ఎక్కడికక్కడ విడగొట్టి చూడరాదని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎం ఖాన్వీల్కర్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఓ మలయాళ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్న మీష నవలను వివాదాల కారణంగా నిలిపివేశారు.


మలయాళ నవల మీష సెన్సారింగ్‌కు సుప్రీం నో
మలయాళ నవల మీష (మీసాలు)లో కొన్ని భాగాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎస్ హరీశ్ రాసిన ఆ నవలలో గుడికి వెళ్లే స్త్రీలను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలున్నాయని అంటూ ఢిల్లీకి చెందిన ఎన్ రాధాకృష్ణన్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత దృష్టితో పుస్తకాలపై సెన్సారింగ్ చేయడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రచయిత సృజనాత్మకతను గౌరవించాలని, చిత్రకారుడు రంగులతో ఆడుకున్నట్టుగానే, రచయిత మాటలతో ప్రయోగాలు చేస్తాడని తెలిపింది. పుస్తకాన్ని మొత్తంగా చూడాలి తప్ప ఎక్కడికక్కడ విడగొట్టి చూడరాదని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎం ఖాన్వీల్కర్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఓ మలయాళ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్న మీష నవలను వివాదాల కారణంగా నిలిపివేశారు.మలయాళ నవల మీష సెన్సారింగ్‌కు సుప్రీం నో
మలయాళ నవల మీష (మీసాలు)లో కొన్ని భాగాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఎస్ హరీశ్ రాసిన ఆ నవలలో గుడికి వెళ్లే స్త్రీలను అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలున్నాయని అంటూ ఢిల్లీకి చెందిన ఎన్ రాధాకృష్ణన్ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత దృష్టితో పుస్తకాలపై సెన్సారింగ్ చేయడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రచయిత సృజనాత్మకతను గౌరవించాలని, చిత్రకారుడు రంగులతో ఆడుకున్నట్టుగానే, రచయిత మాటలతో ప్రయోగాలు చేస్తాడని తెలిపింది.

పుస్తకాన్ని మొత్తంగా చూడాలి తప్ప ఎక్కడికక్కడ విడగొట్టి చూడరాదని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఏఎం ఖాన్వీల్కర్ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఓ మలయాళ పత్రికలో ధారావాహికగా ప్రచురితమవుతున్న మీష నవలను వివాదాల కారణంగా నిలిపివేశారు.

1043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles