అప్పుడే స్వీట్లు రెడీ చేశారు..

Wed,October 23, 2019 10:45 PM

ముంబయి: రేపు (అక్టోబర్‌ 24న) మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. కాగా, ముంబయిలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో అప్పుడే మిఠాయిలు సిద్దం చేశారు. ఏంటని ఆరా తీయగా.. అక్కడున్న బీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రేపు జరిగే ఓట్ల లెక్కింపులో బీజేపీ బంపర్‌ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఈ ఏర్పాట్లు ముందుగానే చేస్తున్నామని వారు వెల్లడించారు. కౌంటింగ్‌ మొదలవడమే ఆలస్యం బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలతో సందడి చేయడం ఖాయమని వారు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, మహారాష్ట్రలో బీజేపీ, శివసేన జట్టుగా అసెంబ్లీ బరిలోకి దిగిన విషయం విదితమే.



1092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles