స్కూల్లో శృంగారం.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..

Wed,September 11, 2019 10:17 AM

Tamil Nadu teacher caught having sex in govt school thrashed by angry villagers

చెన్నై : ఓ ఉపాధ్యాయుడు తాను పని చేస్తున్న పాఠశాలలోనే రాసలీల పర్వం కొనసాగించాడు. ఉపాధ్యాయుడి రాసలీలను పసిగట్టిన గ్రామస్తులు.. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని ఉడుప్పమ్‌ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఓ టీచర్‌.. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే వీరిద్దరూ గత కొంతకాలం నుంచి పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఆ ఆవరణలోనే శృంగారం చేస్తున్నారు. విద్యార్థుల ముందు కూడా వారు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయాలన్నింటినీ పిల్లలు ఎప్పటికప్పుడు తమ తల్లిదండ్రులకు చెప్తూ వచ్చారు. మొత్తంగా ఉపాధ్యాయుడి రాసలీలను గ్రామస్తులు పసిగట్టి మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం టీచర్‌కు దేహశుద్ధి చేసి అతడిని పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. అంగన్‌వాడీ వర్కర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

32345
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles