పొద్దున ఒక గంట.. రాత్రి ఒక గంట..

Fri,November 2, 2018 11:47 AM

చెన్నై : దీపావళి పర్వదినం పురస్కరించుకొని రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కోరింది. తమ రాష్ట్రంలో దీపావళి ఉదయం సమయంలోనే చేసుకుంటామని కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో పొద్దున ఒక గంట.. రాత్రి సమయంలో ఒక గంట పటాకులు కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటలకు పటాకులు కాల్చాలని వెల్లడించింది.

1264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles