మేం ఉదయమే పటాకులు కాలుస్తాం..

Tue,October 30, 2018 12:03 PM

చెన్నై: దీపావళి రోజుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాకులు కాల్చాలని ఇటీవల సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు ప్రభుత్వం సోమవారం దీపావళి విషయంలో కొన్ని వెసలుబాట్లు కోరింది. తమ రాష్ట్రంలో దీపావళిని ఉదయం చేసుకుంటామని, తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు టపాకులు కాల్చుకునే అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును తమిళనాడు కోరింది. భారత్ ఓ సమాఖ్య దేశమని, వివిధ రాష్ర్టాల్లో వివిధ రకాల సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయని, దీపావళి పండుగ విషయంలోనే ఒక్కొక్క రాష్ట్రం భిన్నంగా జరుపుకుంటుందని అడ్వకేట్ వినోద్ ఖన్నా తన పిటిషన్‌లో వాదించారు. రావణుడిని సంహరించిన రాముడు ఇంటికి వచ్చిన తర్వాత ఉత్తర భారతీయులు రాత్రి పూట దివాళీ జరుపుకుంటారని, కానీ దక్షిణ భారతీయులు నరకాసుర వధ జరిగిన మరుసటి రోజు ఉదయం దీపావళి జరుపుకుంటారని అడ్వకేట్ వినోద్ తన పిటిషన్‌లో తెలిపారు. తమిళనాడులో దీపావళి రోజు ఉదయం 4 గంటలకే ప్రజలు నిద్ర లేచి తలంటు స్నానం చేస్తారని, ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుని, పటాకులు కాలుస్తారని పిటిషన్‌లో తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 6వ తేదీ ఉదయమే తమిళనాడు ప్రజలు దీపావళి పండుగను జరుపుకోనున్నట్లు అడ్వేకేట్ చెప్పారు.

2330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles