ఉద‌య‌మే ప‌టాకులు కాల్చిన త‌మిళ ప్ర‌జ‌లు

Tue,November 6, 2018 09:08 AM

చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశించిన‌ట్లే.. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ప‌టాకులు కాల్చారు. వాస్త‌వానికి త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు.. దీపావ‌ళి రోజున ఉద‌య‌మే బాణాసంచా కాలుస్తారు. కానీ ఇటీవ‌ల సుప్రీంకోర్టు త‌న తీర్పులో రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కే బాంబులు పేల్చాల‌ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల నుంచి స‌డ‌లింపు కావాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సుప్రీంను కోరింది. ఆ అభ్య‌ర్థ‌న మేర‌కు త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఉద‌యం కూడా ప‌టాకులు కాల్చుకునే అవ‌కాశాన్ని క‌ల్పించారు. దాంతో ఇవాళ ఉద‌యం త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు ఉద‌యం 6 గంట‌ల నుంచి 7 గంటల వ‌ర‌కు బాణాసంచా పేల్చారు. త‌మిళ‌నాడులోని చెన్నై, కోయంబ‌త్తూర్‌తో పాటు అనేక న‌గ‌రాలు, గ్రామాల్లో ప్ర‌జ‌లు ఉద‌యం ప‌టాకులు కాల్చారు. సాయంత్రం కూడా 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు మ‌రో గంట‌పాటు ప‌టాకులు పేల్చ‌నున్నారు. అయితే కొన్ని వ‌ర్గాల నుంచి మాత్రం సుప్రీం ఆదేశాల ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. పండ‌గ పూట బాంబులు కాల్చేందుకు స‌మ‌యాన్ని నిర్దేశించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీపావ‌ళి రోజున ఎప్పుడు తినాలి, ఎప్పుడు పూజించాలో సుప్రీం చెబితే బాగుంటుంద‌ని కొంద‌రు చ‌మ‌త్క‌రిస్తూ త‌మ అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

2061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles