మూడేళ్ల తర్వాత ఉప్పొంగిన తపతి నది..వీడియో

Thu,August 8, 2019 05:46 PM

Tapti river overflows after 3 years, enters Tapti temple


మధ్యప్రదేశ్ : కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాల్లో నదులు, సరస్సులు ఉప్పొంగుతున్నాయి. కుండపోత వర్షాలకు మధ్యప్రదేశ్ లోని బెతుల్ పరివాహక ప్రాంతంలో తపతి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మూడేళ్ల తర్వాత తపతి నది నిండుకుండలా మారడంతో ముల్తాయ్ గ్రామవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాల నిరీక్షణ తర్వాత వరుణుడి రాకతో తపతి నది నిండి..తపతి ఆలయానికి నీరు చేరింది. ఆలయం పై నుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. ముల్తాయ్ వాసులు ఆలయం వద్ద నీటిలో తడిసిపోతూ సంబురాలు చేసుకున్నారు.
3420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles