పటాకులపై నిషేధమా.. హిందువులను టార్గెట్ చేస్తున్నారు!

Thu,October 12, 2017 01:44 PM

న్యూఢిల్లీ: దీపావళికి పటాకులను నిషేధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టారు యోగా గురు రాందేవ్ బాబా. హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హిందువుల పండుగలపైనే ఇలా నిషేధాలు విధించడం సరికాదని ఆయన స్పష్టంచేశారు. కోర్టు తీర్పును స్వాగతించిన కాంగ్రెస్ నేత శశి థరూర్‌పైనా రాందేవ్ మండిపడ్డారు. థరూర్‌లాంటి తెలివైన వ్యక్తి ఇలా మాట్లాడకూడదని అన్నారు. నవంబర్ 1 వరకు ఢిల్లీలో పటాకుల అమ్మకంపై నిషేధాన్ని కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తీర్పుపై వ్యతిరేకతే ఎక్కువగా వ్యక్తమవుతున్నది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ కూడా రాందేవ్‌లాగే స్పందించారు. హిందువుల పండుగలపైనేనా మీ ప్రతాపం.. మొహర్రం రక్తపాతాన్ని నిషేధించే దమ్ముందా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించిన విషయం తెలిసిందే.

2498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles