బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు

Thu,June 20, 2019 06:29 PM

TDP Four Rajya Sabha MPs joined in BJP

ఢిల్లీ: టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈ ముగ్గురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి జేపీ నడ్డా వీరిని సాధరంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణంగా ఎంపీ గరికపాడి మోహన్‌రావు వీరితో పాటు నేడు బీజేపీలో చేరలేదు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు. కాసేపటి క్రితమే టీడీపీని వీడుతున్నట్లు పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు నలుగురు ఎంపీలు సంతకాలు చేసి లేఖ అందజేశారు. మొత్తం ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో టీడీపీకి మిగిలింది ఇక ఇద్దరు ఎంపీలు మాత్రమే.2095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles