ఇక క్రికెట‌ర్ల‌కూ డోపింగ్ ప‌రీక్ష‌లు..

Fri,August 9, 2019 02:57 PM

హైద‌రాబాద్‌: టీమిండియా క్రికెట‌ర్లు ఇక నుంచి డోపింగ్ ప‌రీక్ష‌కు హాజ‌రుకావాల్సి ఉంటుంది. నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుంది. క్రికెట‌ర్లు డోప్ ప‌రీక్ష‌కు మిన‌హాయింపు కాదు అని ఇవాళ కేంద్ర క్రీడాశాఖ బీసీసీఐకి స్ప‌ష్టం చేసింది. దీంతో ఇప్పుడు నాడా నిర్వ‌హించే ప‌రీక్ష‌ల‌కు క్రికెట‌ర్లు హాజ‌రుకావాల్సి ఉంటుంది. నాడా త‌మ‌పై ప‌రీక్ష‌లు చేయ‌రాదంటూ గ‌తంలో బీసీసీఐ వాదించింది. కానీ ఇప్పుడు క్రీడాశాఖ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డంతో ఇక క్రికెట‌ర్లు కూడా డోప్ ప‌రీక్ష‌ల‌కు లోనుకానున్నారు. బీసీసీఐకి కూడా నాడా కింద‌కు రావాల‌ని గ‌తంలో వ‌ర‌ల్డ్ డోపింగ్ ఏజెన్సీ పేర్కొన్న‌ది. దాని ప్ర‌కారం ఇప్పుడు చ‌ర్య‌లు మొద‌ల‌య్యాయి. క్రికెట‌ర్లు డోపింగ్ నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉంటార‌ని బీసీసీఐ ఈసీవో రాహుల్ జోహ్రీ ఇవాళ క్రీడా కార్య‌ద‌ర్శి రాధేశ్యామ్ జుల‌నియాకు తెలియ‌జేశారు. క్రికెటర్లు అంద‌రూ ఇప్పుడు ప‌రీక్ష‌కు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రువుతార‌ని జుల‌నియా చెప్పారు. అయితే డోపింగ్ కిట్‌ల గురించి బీసీసీఐ కొన్ని అభ్యంత‌రాలు చెప్పిన‌ట్లు క్రీడాకార్య‌ద‌ర్శి తెలిపారు. నేష‌న‌ల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) కింద‌కు బీసీసీ వ‌స్తుంద‌ని బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీస‌ర్ రాహుల్ జోహ్రీ తెలిపారు. ప్ర‌భుత్వ చ‌ట్టాల‌ను అనుస‌రించాల‌ని, వాటిని అమ‌లు చేసేందుకు తాము క‌ట్ట‌బ‌డి ఉన్నామ‌ని జోహ్రీ చెప్పారు.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles