జెండా స్తంభానికి విద్యుత్ షాక్..ముగ్గురు చిన్నారులు మృతి

Wed,August 14, 2019 08:45 AM

teenagers  dies after touching  Flag Pole

ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతమాగులూరు కొప్పరంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఇనుప స్తంభమే ముగ్గురు చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. గ్రామంలో ఉన్న జెండా స్తంభం పట్టుకొని ఆడుతుండగా ప్రమాదం జరిగింది. స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో చిన్నారులకు కరెంట్ షాక్ తగిలింది. ముగ్గురు చిన్నారులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. చిన్నారులు షేక్ పఠాన్ గౌస్, హసన్, పఠాన్ అమర్ ఐదో తరగతి చదువుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జెండా స్తంభానికి పక్కనే ఉన్న విద్యుత్ లైన్ తగలడంతో విద్యుత్ సరఫరా అయినట్లు స్థానికులు చెబుతున్నారు.

1023
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles