తేజ్‌బహదూర్ నామినేషన్ అందుకే తిరస్కరించాం..

Wed,May 1, 2019 04:57 PM


వారణాసి: ఎవరైనా వ్యక్తి గత ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వ లేదా కేంద్రప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగించబడినపుడు..ఆ వ్యక్తి అవినీతికి పాల్పడటం, విశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఉద్యోగం నుంచి తొలగించబడలేదనే విషయాన్ని ధృవీకరిస్తూ ఈసీ సర్టిఫికెట్ జారీచేస్తుంది. అయితే ఆ సర్టిఫికెట్‌ను తేజ్‌బహదూర్ యాదవ్ మంగళవారం ఉదయం 11 గంటలలోపు సమర్పించలేదు. అందుకే ఆయన నామినేషన్‌ను తిరస్కరించామని వారణాసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే అధికారులు అడిగిన అన్ని సాక్ష్యాధారాలు అందజేసినప్పటికీ, నామినేషన్ చెల్లదని చెప్పారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేజ్‌బహదూర్ తరపు న్యాయవాది రాజేశ్ గుప్తా చెప్పారు.

1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles