నామినేషన్ రద్దుపై సుప్రీంకు తేజ్‌బహదూర్

Mon,May 6, 2019 01:49 PM


ఎన్నికల సంఘం తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంపై బీఎస్‌ఎఫ్ మాజీ జవాను తేజ్‌బహదూర్ యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను పోటీ నుంచి తప్పించడానికే పోల్ ప్యానెల్ వివక్ష పూరితం, అకారణంగా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిందని తేజ్‌బహదూర్ యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి తేజ్‌బహదూర్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేయాలని భావించగా..ఈసీ తేజ్‌బహదూర్ నామినేషన్‌ను తిరస్కరించింది. అఫిడవిట్‌లో పేర్కొన్న ధ్రువపత్రాలను గడువులోగా సమర్పించకపోవడంతో..రిటర్నింగ్ అధికారి తేజ్‌బహదూర్ యాదవ్ నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles