యూపీలో టెంట్ సిటీని చూశారా..? వీడియో

Thu,December 20, 2018 07:41 PM

Tent city formed in prayagraj for devotees

ప్రయాగ్‌రాజ్‌ : జనవరి 15 2019 నుంచి ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లే భక్తులు బస చేసేందుకు సాధారణంగా ఏ లాడ్జిలోనో, హోటల్‌లోనో రూమ్‌లు బుక్ చేసుకుంటారు. డబ్బున్నవారైతే ఏ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గదులను బుక్ చేస్తారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం సరికొత్త ఆలోచన చేశారు యూపీ అధికారులు. కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని అధికారులు టెంట్ సిటీకి రూపకల్పన చేశారు. భక్తులు, సందర్శకుల కోసం ప్రయాగ్‌రాజ్‌లో అత్యాధునిక సౌకర్యాలు, మౌళిక వసతులతో కూడిన టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. టెంట్ సిటీలో మొత్తం 4వేల అత్యాధునిక టెంట్లు, సూట్లు అందుబాటులో ఉంచాం. టెంట్ సిటీలో పైవ్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. టెంట్ సిటీలో రూంలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని ప్రయాగ్‌రాజ్ కమిషనర్ ఆశిష్ గోయెల్ తెలిపారు.

2268
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles