అల్వార్‌ నిందితులను ఉరి తీయాల్సిందే : మాయావతి

Sat,May 11, 2019 10:53 AM

హైదరాబాద్‌ : రాజస్థాన్‌లోని అల్వార్‌లో దళిత మహిళపై ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం మాయావతి స్పందించారు. దళిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్‌ ప్రభుత్వంతో పాటు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఒక్క దళిత మహిళకే సంబంధించిన విషయం కాదు.. అన్ని వర్గాల మహిళలకు సంబంధించిన విషయమన్నారు మాయావతి. ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొందరు నాయకులు మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, అలాంటి వారిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్‌ చేశారు.

850
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles