కీలక నిర్ణయం.. వేర్పాటువాదుల భద్రత తొలగింపు

Sun,February 17, 2019 01:21 PM

The Jammu and Kashmir government withdrew security of separatist leaders

శ్రీనగర్: పుల్వామా ఉగ్రదాడిపై జమ్ము కశ్మీర్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కశ్మీర్ వేర్పాటువాద నేతలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించింది. అలాగే వారికి ప్రభుత్వం కల్పిస్తున్న ఇతర సదుపాయాలు కూడా నిలిపివేసింది. జమ్ము కశ్మీర్‌లో వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారని భావించిన ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

వేర్పాటువాద నేతలు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, బిలాల్ లోన్, అబ్దుల్ ఘనీ భట్, హషీం ఖురేషీ, షబీర్‌షాలకు భద్రతను తొలగించారు. సాయంత్రం కల్లా భద్రత, వాహనశ్రేణి ఉపసంహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సాయంత్రం వరకు కర్ఫ్యూ ఉంటుందని ఆర్మీ ప్రకటించింది.

3775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles