ఆ జాబితా నుంచి పాకిస్థాన్ తొలగింపు

Fri,February 15, 2019 11:41 AM

The most favoured nation status which was granted to Pakistan stands withdrawn says Arun Jaitley

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి అనంతరం.. అత్యంత అభిమాన దేశాల జాబితా నుంచి పాకిస్థాన్‌ను భారత్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయబోతున్నాం. పుల్వామా ఘటనపై రేపు హోంమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. పుల్వామా ఘటన వివరాలను అన్ని పార్టీలకు రాజ్‌నాథ్ వివరిస్తారు. పాకిస్థాన్‌ను ఒంటరిని చేసేందుకు విదేశాంగ శాఖ తరపున అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటాం. చొరబాటుదారులు ప్రవేశించకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తాం. చొరబాటుదారులకు సాయపడుతున్న వారిని వదిలే ప్రసక్తే లేదు. దేశ ద్రోహులకు సాయం చేసేవారు ఫలితం అనుభవిస్తారు అని జైట్లీ పేర్కొన్నారు.4715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles