వంటగదిలోకి వచ్చిన మొసలి..

Wed,May 22, 2019 04:27 PM

Thirsty crocodile entered into a house kitchen in gujarat

వడోదర: గుజరాత్‌లో మొసలి ఓ ఇంట్లోకి ప్రవేశించి..జనాలను బెంబేలెత్తించింది. రావల్ గ్రామంలో రాధాబెన్ గోహిల్ అనే మహిళ ఇంటి కిచెన్‌లో మొసలి కనిపించడంతో భయబ్రాంతులకు లోనయ్యారు.

ఈ విషయమై రాధాబెన్ మాట్లాడుతూ..ఇవాళ వేకువ జామున 5 గంటలకు నా కూతురు నిమీషా నీళ్లు తాగేందుకు వంటగదిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఓ మొసలి కిచెన్ లో ఉన్నట్లు చూసి..వెంటనే వచ్చి నాకు చెప్పింది. అయితే కిచెన్‌లో మొసలి ఏంటీ అని నేను నమ్మలేదు. ఆ తర్వాత వంటగది వద్దకు వెళ్లి చూశాక నిమీషా చెప్పింది నిజమేనని తెలిసింది. ఆ మొసలి 4.5 అడుగుల పొడవుంది. బహుశా అది మా ఇంటికి సమీపంలోని కుంట నుంచి దాహం తీర్చుకునేందుకు ఇంట్లోకి చొరబడిందనుకుంటా. కిచెన్‌లోని కుండలో ఉన్న నీటిని తాగేందుకు మొసలి ప్రయత్నించింది. అయితే మొసలి మాత్రం ఎవరిపై దాడి చేయలేదని చెప్పుకొచ్చింది. ఇంట్లోకి మొసలి చొరబడినట్లు సమాచారమందుకున్న ఫారెస్ట్ అధికారులు సుమారు రెండు గంటలపాటు శ్రమించి మొసలిని పట్టుకుని అజ్వా సరస్సులో వదిలిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

3364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles