ఈ బాణసంచాతో పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగదట..!

Sun,November 4, 2018 03:32 PM

అస్సాం: దీపావళి రోజున రాత్రి పూట కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చాలని ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే నిబంధనను అనుసరించి బాణసంచా కాల్చుకోవడానికి నిర్దిష్టమైన సమయాలను కేటాయించాయి. అయితే సుప్రీం కోర్టు ఇలాంటి నిబంధనను విధించడానికి బలమైన కారణం ఉంది. అదేమిటంటే.. బాణసంచా కాల్చడం వల్ల వెలువడే శబ్దం, పొగ, కెమికల్స్.. తద్వారా కలుషితమయ్యే పర్యావరణం.. వల్లే మనకు నష్టం కలుగుతుందని సుప్రీం కోర్టు ఇలా తీర్పునిచ్చింది. కానీ అస్సాంలో తయారయ్యే గ్రీన్ క్రాకర్స్‌ను కాలిస్తే అసలు ఇలాంటి ఇబ్బందే ఉండదు.

అస్సాంలోని గనక్కుకి అనే గ్రామంలో 1885 నుంచి.. అంటే.. గత 130 సంవత్సరాలుగా గ్రీన్ క్రాకర్స్‌ను తయారు చేస్తున్నారు. ఈ బాణసంచాను కాలిస్తే తక్కువ శబ్దం వస్తుందట. అలాగే పొగ, కెమికల్స్ విడుదల కావట. దీని వల్ల మన ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి కూడా మంచి జరుగుతుంది.

అయితే ప్రస్తుతం ఈ గ్రీన్ క్రాకర్స్‌ను మనుషులే తయారు చేస్తున్నారు. యంత్రాలతో తయారీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ ఈ గ్రీన్ బాణసంచా తయారీని ప్రోత్సహిస్తే.. ఎంతో మందికి ఉపాధి దొరకడమే కాదు, పైన చెప్పిన విధంగా పర్యావరణానికి మేలు చేసిన వారమవుతాం..!

1662
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles