క్లారిటీ ఇచ్చిన థామ‌స్ కుక్ ఇండియా..

Mon,September 23, 2019 03:27 PM

హైద‌రాబాద్‌: ట్రావెల్ ఏజెన్సీ థామ‌స్ కుక్ ఇండియా ఇవాళ ఓ ప్ర‌ట‌క‌న చేసింది. బ్రిట‌న్‌కు చెందిన థామ‌స్ కుక్ ప‌బ్లిక్ లిమిటెడ్ కంపెనీతో సంబంధం లేద‌ని పేర్కొన్న‌ది. బ్రిట‌న్‌కు చెందిన థామ‌స్ కుక్.. దివాళా తీసిన విష‌యం తెలిసిందే. థామ‌స్ కుక్ ఇండియాకు బ్రిట‌న్ సంస్థ‌తో సంబంధం లేద‌ని, త‌మ‌కు కెన‌డాకు చెందిన ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్షియ‌ల్ హోల్డింగ్స్‌తో లింకు ఉన్న‌ట్లు ఆ కంపెనీ చెప్పింది. బ్రిట‌న్ కంపెనీతో త‌మ‌కు సంబంధం లేద‌ని తేల్చింది. 2012లోనే కెన‌డా కంపెనీ టేకోవ‌ర్ చేసుకుంద‌ని థామ‌స్ కుక్ ఇండియా చెప్పింది. థామ‌స్ కుక్ ఇండియా కంపెనీలో 77 శాతం కెన‌డా కంపెనీ పెట్టుబ‌డులున్నాయి.



1724
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles