లష్కరే తోయిబా ఉగ్రవాది హతం

Wed,September 11, 2019 11:10 AM

Top LeT terrorist killed by security forces in Jammu kashmir Sopore

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇవాళ ఉదయం కారులో వెళ్తున్న ఉగ్రవాదిని బలగాలు ఆపే ప్రయత్నం చేశాయి. కానీ ఆ ఉగ్రవాది తన కారును ఆపకుండా ముందుకెళ్లి బలగాలపై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు.. కారును వెంబడించి ఉగ్రవాదిని మట్టుబెట్టారు. బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదిని లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఆసిఫ్‌గా పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు గాయపడిన విషయం విదితమే. వీరిలో ఒక చిన్నారి కూడా ఉంది. అయితే ఈ కాల్పులకు పాల్పడింది తానేనని ఆసిఫ్‌ ప్రకటించాడు. ఇక నిన్న 8 మంది ఉగ్రవాద సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

908
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles