భారీగా పెరిగిన చంద్రబాబు, లోకేష్‌ ఆస్తులు

Fri,March 22, 2019 07:13 PM

total assets of AP Chief Minister Chandrababu Naidu family

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ ఆస్తులు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. నామినేషన్‌ సందర్భంగా తన ఆస్తి విలువ సుమారు రూ.700 కోట్లని చంద్రబాబు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు స్థిరాస్తుల విలువ రూ.19కోట్ల 96 లక్షలు కాగా చరాస్తుల విలువ రూ.47 లక్షల 38వేలుగా చూపించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చరాస్తుల విలువ రూ. 574కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భువనేశ్వరి స్థిరాస్తుల విలువ రూ.95కోట్లుగా పేర్కొన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తన ఆస్తి విలువను 176 కోట్లుగా చూపించారు.

నారా లోకేష్‌ తన ఆస్తి విలువ రూ.375కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తుల విలువ రూ.253 కోట్ల 68 లక్షల 92వేలు కాగా స్థిరాస్తుల విలువ రూ.66కోట్ల 78 లక్షలుగా చూపించారు. లోకేష్‌ భార్య బ్రాహ్మణి స్థిరాస్తుల విలువ రూ.18.74 కోట్లు కాగా చరాస్తుల విలువ రూ.14కోట్ల 40లక్షలుగా పేర్కొన్నారు. లోకేష్‌ కుమారుడు దేవాన్ష్‌ స్థిరాస్తుల విలువ రూ.16.17కోట్లు.. చరాస్తుల విలువ రూ.3.88కోట్లుగా చూపించారు.

7869
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles