వాట్ యాన్ ఐడియా సర్‌జీ.. ట్రాక్టర్‌నే జేసీబీగా మార్చాడు.. వీడియో

Sat,May 25, 2019 12:11 PM

tractor jcb invention video goes viral

నెస్సెసిటీ ఈజ్ ది మథర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఊరికే అనలేదు. మన అవసరం మనల్ని ఏదైనా చేసేలా చేస్తుందట. అందుకే మెదడుకు కాస్త పదును పెడితే.. ఏదైనా చేయొచ్చు. సాధారణంగా గుంతలు తవ్వడానికి, మట్టిని ఎత్తడానికి.. ఇతరత్రా పనులను జేసీబీని ఉపయోగిస్తుంటారు. అయితే.. జేసీబీని రెంట్‌కు తీసుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. పెద్ద పెద్ద పనులకంటే జేసీబీని వాడొచ్చు కానీ.. చిన్న చిన్న పనులకు కూడా వేలకు వేలు పోసి జేసీబీని రెంట్‌కు తీసుకోవాలంటే కష్టం.

అందుకే... ఓ రైతు ఏం చేశాడంటే తనకున్న ట్రాక్టర్‌నే జేసీబీలా మార్చాడు. ట్రాక్టర్ ముందు మట్టి ఎత్తిపోసేలా ఇనుప మంచంలా తయారు చేశాడు. ఏం చక్కా జేసీబీ చేసే పనినే తన ట్రాక్టర్ ద్వారా చేస్తున్నాడు. ట్రాక్టర్ జేసీబీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర వాట్సప్‌వండర్‌బాక్స్ హాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


4523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles