మంచి వైద్యం అందించండి లేదా నన్నూ చంపేయండి..వీడియో

Sun,June 16, 2019 03:07 PM


ముజఫర్ పూర్: ముజఫర్ పూర్ లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మెదడువాపు వ్యాధి లక్షణాలతో చాలా మంది చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రిలో ఓ రోగి సోదరుడు ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నా సోదరుడు గత రెండు నెలలుగా ఈ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక్కడికి చాలా మంది చిన్నారులు చికిత్స కోసం వచ్చారు. వారంతా ప్రస్తుతం మరణశయ్యపై ఉన్నారు. ఆస్పత్రిలో చేరిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి..మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. వారికి సరైన వైద్యం అందించాలి. నా సోదరుడికి సరైన వైద్యం అందించండి లేకుంటే నన్ను కూడా చంపేయాలని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.



3945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles