అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌దే హవా!

Sun,May 19, 2019 08:45 PM

TRS Party will win in Telangana

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించనుంది. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే ప్రభంజనం కొనసాగుతోంది. మొన్న అసెంబ్లీ ఎన్నికలు, నిన్న సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయాన్ని ముద్దాడబోతోంది. ఇవాళ విడుదలైన అన్ని సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌దే హవా కొనసాగుతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కనుమరుగై పోయాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతానికి పైగా ఓటు బ్యాంకుతో టీఆర్‌ఎస్ దూసుకుపోయింది. ఏబీపీ, వీడీపీ, మిషన్ చాణక్య సర్వేలు.. టీఆర్‌ఎస్ 16 స్థానాల్లో గెలుస్తోందని అంచనాలు వేశాయి. మిగిలిన ఒక్క స్థానం ఎంఐఎం ఖాతాలోకి వెళ్తుందని తెలిపాయి. ఇక సీ-ఓటర్ సర్వే ప్రకారం టీఆర్‌ఎస్‌కు 14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కొక్క స్థానంలో గెలవనున్నట్లు అంచనా వేసింది. ఇండియా టుడే సర్వే.. టీఆర్‌ఎస్ 10 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.

3203
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles