రోజుకు 1600 ఇంటర్వ్యూలు..ఒక్కరికి 10 సెకన్లే

Thu,November 21, 2019 06:47 PM


బీహార్: కేవలం 186 గ్రూప్-డీ (నాలుగో కేటగిరి) పోస్టులకు 5 లక్షల దరఖాస్తులు రావడం దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను తెలియజేస్తుందని కాంగ్రెస్ నేత ప్రేమ్ చంద్ మిశ్రా తెలిపారు. బీహార్‌లో గ్రూప్ డీ పోస్టులకు ఉన్నత విద్యార్హత కలిగిన ఎంబీఏ, ఎంసీఏ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవడం విచారించాల్సిన విషయమన్నారు. ఈ విషయమై ప్రేమ్‌చంద్ మిశ్రా మాట్లాడుతూ..ఫ్యూన్, గార్డెనర్లు, గేట్ కీపర్ల పోస్టుల కోసం ఇప్పటివరకు 4,32వేల మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సెప్టెంబర్ నుంచి ఉద్యోగ నియమకాల కోసం ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. ప్రతీ రోజు 1500-1600 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఒక్క వ్యక్తిని కనీసం 10 సెకన్లపాటు కూడా ఇంటర్వ్యూ చేయడం లేదు. దీన్ని బట్టి ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరుగుతుందని అర్థమవుతున్నది. నిరుద్యోగ సమస్య మన దేశానికి పెద్ద ముప్పులాంటిదని ప్రేమ్‌చంద్ మిశ్రా అన్నారు.

4330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles