క్రీడామంత్రితో జైరా వ‌సీమ్ దంగ‌ల్‌!

Fri,January 20, 2017 05:02 PM

Union Minister Vijay Goels tweet in praise of Zaira Wasim backfired

న్యూఢిల్లీ: ద‌ంగ‌ల్ ఫేమ్ జైరా వ‌సీం మ‌రోసారి వార్త‌ల్లోకెక్కింది. మెహ‌బూబాను క‌ల‌వ‌డంపై ఆమె క్ష‌మాప‌ణ చెప్ప‌డం.. అందులో త‌ప్పేమీ లేదంటూ సెల‌బ్రిటీలంతా ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కేంద్ర క్రీడామంత్రి విజ‌య్ గోయెల్‌ పొగ‌డ్త‌ను త‌ప్పుగా అర్థం చేసుకొని మ‌రోసారి వార్తల్లోకెక్కింది జైరా. ముసుగు ధ‌రించిన మ‌హిళ‌, పంజ‌రంలో ఉన్న మ‌రో మ‌హిళ పెయింటింగ్‌ను వ‌ర్ణిస్తూ.. ఇది జైరా వ‌సీమ్ స్టోరీకి ద‌గ్గ‌ర‌గా ఉంది. సంకెళ్ల‌ను తెంచుకుంటూ మ‌న కూతుళ్లు ముందుకెళ్తున్నారు. వారికి మరింత శ‌క్తి రావాలి అంటూ గోయెల్‌ ట్వీట్ చేశారు. నిజానికి జైరాను పొగుడుతూ చేసిన ట్వీట్ ఇది.

కానీ దీనికి ఆయ‌న ఊహించ‌ని జ‌వాబు జైరా వ‌సీమ్ ఇచ్చింది. ఇలాంటి మూస పొగ‌డ్త‌లు త‌న‌కు న‌చ్చ‌వ‌న్న రీతిలో స‌మాధాన‌మిచ్చింది. త‌న‌ను అలాంటి అమ‌ర్యాద‌క‌ర చిత్ర‌ణ‌ల‌తో పోల్చ‌వ‌ద్ద‌ని స్ప‌ష్టంచేసింది. ముసుగు ధ‌రించిన మ‌హిళ‌లు ఎంతో స్వేచ్ఛ‌గా ఉన్నార‌ని జైరా ట్వీట్ చేసింది.


అయితే త‌న పొగ‌డ్త‌ను జైరా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని క్రీడామంత్రి గోయెల్ అన్నారు. తాను జైరా అభ్యున్న‌తిని ప్ర‌శంసించాన‌ని చెప్పారు. నీకు ఇప్ప‌టికీ అర్థం కాలేద‌నుకుంటా. నిన్ను నేరుగా క‌లువాల‌ని అనుకుంటున్నాను. ఆల్‌ద బెస్ట్ అంటూ గోయెల్ మ‌రో ట్వీట్ చేశారు. దంగ‌ల్ సినిమాలో గీతా పోగాట్ యుక్త వ‌య‌సు పాత్ర పోషించిన జైరా.. త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

1458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles