అలహాబాద్ ఇక ప్రయాగ్‌రాజ్.. ప్రతిపాదనను ఆమోదించిన యూపీ కేబినెట్

Tue,October 16, 2018 01:19 PM

UP Cabinet approves the proposal of renaming Allahabad to Prayagraj

లక్నో: అలహాబాద్ పేరు మారింది. ఇక నుంచి ప్రయాగ్‌రాజ్‌గా పిలవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనను యూపీ కేబినెట్ ఆమోదించింది. పేరు మార్చకూడదంటూ నిరసనలు వ్యక్తమైనా యోగి ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. మంగళవారం నుంచి అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నాం అని యూపీ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. నిజానికి అలహాబాద్ పురాతన కాలంనాటి పేరు ప్రయాగ్. దానిని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో అంటే 16వ శతాబ్దంలో పేరు మార్చారు. అక్బర్ అక్కడో కోటను నిర్మించి దానితోపాటు చుట్టుపక్కల ప్రాంతానికి ఇలహాబాద్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అక్బర్ మనువడు షాజహాన్ ఆ పేరును అలహాబాద్‌గా మార్చారు.

అయితే ఇక్కడ గంగ, యమున కలిసే సంగమాన్ని మాత్రం ప్రయాగ్ అనే పిలుస్తున్నారు. గత శనివారమే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన విషయం తెలిసిందే. బ్రహ్మదేవుడు తొలి యజ్ఞం చేసింది ఇక్కడే. రెండు నదులు కలిసిన చోటును ప్రయాగ్ అంటారు. కానీ అలహాబాద్‌లో మాత్రం గంగ, యమున, సరస్వతి కలుస్తున్నాయి. దీనికి ప్రయాగాల రాజుగా పిలుస్తారు. అందుకే ప్రయాగ్‌రాజ్‌గా పేరు మారుస్తున్నాం అని యోగి వెల్లడించారు. అయితే ఈ పేరు మార్పును సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

1390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles