కాంగ్రెస్ ఢ‌మాల్‌.. రాజ్‌బ‌బ్బ‌ర్ రాజీనామా

Fri,May 24, 2019 03:05 PM

UP Congress chief Raj Babbar quits over partys one seat show in Lok Sabha polls

హైద‌రాబాద్‌: ఉత్త‌రప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ కేవ‌లం ఒకే సీటుకు ప‌రిమితమైంది. రాయ‌బ‌రేలీ నుంచి సోనియా ఒక్క‌రే తాజా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెలిచారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి రాజ్ బ‌బ్బ‌ర్ ఇవాళ రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని రాహుల్‌కు పంపారు. ఫ‌తేపుర్ సిక్రీ నుంచి పోటీ చేసిన రాజ్‌బబ్బ‌ర్ బీజేపీ చేతిలో ఓడిపోయారు. తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా పార్టీ విఫ‌లమైన నేప‌థ్యంలో రాజ్‌బ‌బ్బ‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యూపీలోని అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ కూడా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ జిల్లా కాంగ్రెస్ చీఫ్ రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. దేశ‌వ్యాప్తంగా ఓట‌మికి బాధ్య‌త వ‌హిస్తూ అనేక మంది కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తూ రాహుల్‌కు లేఖ‌లు పంపిస్తున్నారు. రేపు జ‌రిగే కాంగ్రెస్ క‌మిటీ స‌మావేశాంలోనూ రాహుల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయనున్న‌ట్లు ప్రాథ‌మింక‌గా తెలుస్తోంది.

1391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles