కాంగ్రెస్‌కు ఊర్మిళ మటోండ్కర్‌ రాజీనామా

Tue,September 10, 2019 03:10 PM

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్మిళ మటోండ్కర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ముంబయి నార్త్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఊర్మిళ పోటీ చేశారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీ చేరి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతుంది. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు ఊర్మిళ.. రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. పూర్తి స్థాయిలో పార్టీ నిర్వీర్యం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కొందరిని వాడుకుంటున్నారని ఊర్మిళ మటోండ్కర్‌ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల మధ్య పార్టీలో కొనసాగలేకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశానని ఊర్మిళ స్పష్టం చేశారు.

912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles