ప్రధానిని డిసైడ్ చేసేది మనమే

Tue,January 15, 2019 02:39 PM

లక్నో : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిని డిసైడ్ చేసేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే అని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పొత్తుతో బీజేపీ నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తాము అతి పెద్ద విజయం సాధిస్తామని మాయావతి స్పష్టం చేశారు. మాయావతి 63వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన జీవితమంతా ప్రజల కోసమే అని తెలిపారు.


ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధించేందుకు ఎస్పీ, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిస్తే ప్రధాని అభ్యర్థిని మనమే డిసైడ్ చేయొచ్చన్నారు. ఇది ఒక అవకాశం కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలన్నారు. దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలకు యూపీ ప్రజలు పెద్ద గుణపాఠమే చెప్తారని మాయావతి హెచ్చరించారు. ఇటీవల వెలువడిన ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలు కేవలం బీజేపీకే కాకుండా కాంగ్రెస్‌కు కూడా గుణపాఠం నేర్పాయని మాయావతి తెలిపారు.

మాయావతికి శుభాకాంక్షలు తెలిపిన అఖిలేష్ యాదవ్
బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుష్పగుచ్ఛం అందించిన అఖిలేష్.. శాలువాతో సత్కరించారు.


2652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles